- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. గన్‌తో దర్శనమిచ్చిన హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu).

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu). ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.
అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈక్రమంలో తాజాగా మూవీటీమ్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ట్వీట్ రాసుకొచ్చింది. ‘ఈ 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మరియు అతని గ్యాంగ్ చక్కని యాక్షన్‌తో ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడానికి వస్తున్నారు.. ఇంకా 15 రోజులే ఉన్నాయి.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో చిరంజీవి కూల్‌గా కొబ్బరి బొండా నీళ్లు తాగుంటే వెనుక హీరోయిన్ కేథరీన్ థ్రెసాతో పాటు కమెడియన్స్ గన్స్‌ను పట్టుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






