‘కన్నప్ప’ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. పరమ శివుడు లుక్‌లో ట్రోల్‌కి గురువుతున్న స్టార్ హీరో(పోస్ట్)

by I. Sairam |   (  Updated:2025-05-19 11:27:55  IST  )

టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

‘కన్నప్ప’ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. పరమ శివుడు లుక్‌లో ట్రోల్‌కి గురువుతున్న స్టార్ హీరో(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో తాజాగా కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ప‌ర‌మ శివుడు పాత్ర‌ధారి అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) పూర్తి లుక్‌ను రిలీజ్ చేశారు. అక్ష‌య్ కుమార్ శివుడి లుక్ ఎక్స్టార్డినరీగా ఉంది. అచ్చం ఆ ప‌ర‌మ‌శివుడే నా అనేలా అచ్చు గుద్దినట్లు ఉంది. అయితే మ‌న‌కు అధికంగా నార్త్ ఇండియాలో క‌నిపించే శివుడి ప్ర‌తిమ‌ల మాదిరిగా ఈ లుక్ ఉండ‌డం గ‌మ‌నార్హం. కాకుంటే ఈ ఫొటోలో శివుడి మెడ‌లో పాము లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అక్షయ్ కుమార్‌ లుక్‌ని అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. శివుని మెడలో కచ్చితంగా ఉండాల్సిందే పామే అని అది లేకుండా పరమశివుడు లుక్ కంప్లీట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story