- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మోగ్లీ’ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్.. పోస్ట్ వైరల్
స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా 'మోగ్లీ'(Mowgli).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా 'మోగ్లీ'(Mowgli). కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ సాక్షి(Sakshi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasd), కృతి ప్రసాద్(Kruthi Prasad) ఈ సినిమాను నిర్మించారు.
అయితే... డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2'(Akhanda-2) కారణంగా వాయిదా పడి.. డిసెంబర్ 13న రిలీజ్ కానున్నట్లు నిన్న మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం నేడు మోగ్లీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ..‘2 నిశ్శబ్ద ప్రేమకథలోని అత్యంత బిగ్గరగా ధమాకాను చూడటానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి.
డిసెంబర్ 13న #మోగ్లి2025 గ్రాండ్ రిలీజ్ కానుంది.. డిసెంబర్ 12న ప్రీమియర్లు’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో హీరో రోషన్ కనకాల ఒక చిన్న గుంట ముందు కూర్చోని ఓ కర్రను చెక్కుతున్నాడు. ఇక ఆ వాటర్‌లో రాళ్లతో 2 అని రాసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.






