ఆ కష్టాన్ని తట్టుకోలేకపోయా.. వైరల్‌గా మారిన చంద్ర కామెంట్స్

by Pulgam srinivas |

చంద్ర మాట్లాడుతూ… పని భారం ఎక్కువ కావడం వల్లే జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చానని ఈ కమెడియన్ వెల్లడించాడు.

ఆ కష్టాన్ని తట్టుకోలేకపోయా.. వైరల్‌గా మారిన చంద్ర కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ టెలివిజన్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. ఈయన ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వకముందే పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటి ద్వారా ఈ నటుడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఈయన జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడో, అప్పటి నుంచి ఈయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. చంద్ర ఎక్కువ శాతం భార్యాభర్తలు, అత్తమామలు వంటి ఫ్యామిలీ అంశాలపై స్కిట్లు చేసేవాడు.

దాంతో ఈయనకు బుల్లితెర అభిమానుల నుంచి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఒక దశలో జబర్దస్త్ లోనే అత్యధిక పారితోషకం తీసుకున్న వారిలో చమ్మక్ చంద్ర మొదటి వరుసలో ఉంటాడని కూడా అనేక కథనాలు వచ్చాయి. అంతటి స్థాయిలో ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించిన ఈయన ఆ తర్వాత ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఎందుకు ఈ కమెడియన్ జబర్దస్త్ షోకు దూరమయ్యారు అనే విషయాన్ని తాజాగా చంద్ర వెల్లడించాడు.

చంద్ర మాట్లాడుతూ… జబర్దస్త్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. టీమ్ లీడర్‌గా నాకు స్థానం ఇచ్చినందుకు ఆ షో వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. ఇక ఆ షో నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం పని ఒత్తిడి ఎక్కువ కావడమే. మొదట ఒక వారానికి సరిపడా స్క్రిప్ట్ రాసుకోవాలి, అందుకు సంబంధించిన రిహార్సల్స్ చేయాలి. అలాగే తనతో పాటు ఉన్న నటులతో కూడా రిహార్సల్స్ చేయించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. నాకు అక్కడికక్కడే స్క్రిప్ట్ రాసి, దానిని స్టేజ్‌పై ప్రదర్శించడం రాదు. దానివల్ల నాకు ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి పెరిగింది. అందుకే షో నుంచి బయటకు వచ్చినట్లు చంద్ర తాజాగా చెప్పుకొచ్చాడు.

Next Story