- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్ ఫీడ్‌బ్యాక్‌ను లోకేష్ పరిగణలోకి తీసుకుంటారా..?
రజనీకాంత్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘కూలీ’పై ఇప్పుడు సోషల్ మీడియా లో తీవ్ర చర్చ జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రజనీకాంత్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘కూలీ’పై ఇప్పుడు సోషల్ మీడియా లో తీవ్ర చర్చ జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా విడుదల చేసిన హిందీ వెర్షన్ టైటిల్ ‘మజ్దూర్’పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సన్ పిక్చర్స్ ఈ సినిమా తొలి పాట ‘చికిటు’ను జూన్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ పాట రాబోతోంది. కానీ ఈ ప్రకటన వీడియోలో హిందీ వెర్షన్‌కు ‘మజ్దూర్’ అనే టైటిల్ పెట్టినట్లు వెల్లడించడంతో రజనీ ఫ్యాన్స్ మిగిలిన రెండు భాషల్లో వచ్చిన స్పందనతో పోలిస్తే హిందీలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా హిందీలో భిన్నమైన టైటిల్‌తో రావడం విభిన్నంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా పాన్ ఇండియా చిత్రాలు అన్ని భాషల్లో ఒకే టైటిల్‌తో రావడం అలవాటు. ఇప్పటికే “కూలీ” టైటిల్‌పై మంచి బజ్ ఏర్పడింది. అయితే హిందీలో ‘మజ్దూర్’ అనే టైటిల్ పెట్టడం వల్ల ఆ పాజిటివ్ వేవ్‌కు దెబ్బ తగిలే అవకాశముందని అభిమానులు అంటున్నారు. మరోవైపు ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ‘కూలీ’ అనే టైటిల్ ఇప్పటికే హిందీలో మూడు సినిమాలకు వినియోగించబడినందున కాపీరైట్ ఇష్యూలను నివారించేందుకు సన్ పిక్చర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1983లో వచ్చిన అమితాబ్ బచ్చన్ నటించిన ‘కూలీ’ సినిమాకు ఉన్న గుర్తింపు కూడా ఒక కారణమని చెబుతున్నారు.
అయితే, అభిమానుల తీర్పు మాత్రం స్పష్టంగా ఉంది. రజనీ స్థాయిలో ఉన్న హీరో సినిమాకు హిందీలో వేరే టైటిల్ పెట్టడం సరికాదని, కనీసం ‘రజనీకాంత్’స్ కూలీ’ అని పేరు పెట్టినా బాగుండేదని కొంతమంది సూచిస్తున్నారు. అయితే.. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ.. ఫ్యాన్స్ విపరీతంగా వ్యతిరేకిస్తున్న ‘మజ్దూర్’ టైటిల్ ను లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ బృందం పునరాలోచిస్తారా? లేక ఇదే పేరుతో సినిమా ముందుకు సాగుతుందా? అన్నది చూడాలి.






