manchu Vishnu: మంచు ఫ్యామిలీలో వివాదం.. మొదటి సారి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!

by Hamsa |
manchu Vishnu: మంచు ఫ్యామిలీలో వివాదం.. మొదటి సారి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు(Mohan Babu) తనయుడు మంచు విష్ణు (manchu Vishnu) చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. దీనిని ముఖేష్ కుమార్(Mukesh Kumar) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్, బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్, మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్, మోహన్ బాబు, రవిబాబు, సప్తగిరి, బ్రహ్యానందం, మధుబాల, ముఖేష్ రిషి, యోగిబాబు, మంచు అవ్రామ్, అర్పిత రంకా, వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నా ఈ మూవీ నుంచి కొంతమంది పాత్రలకు సంబంధించిన పోస్టర్స్‌తో పాటు శివుడి సాంగ్ కూడా విడుదలై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇదిలా ఉంటే.. మంచు విష్ణు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వివాదం మొదలైంది. ఇక వీరిద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇక ఇటీవల మంచు మనోజ్ అరెస్ట్ అవడంతో దీని వెనక విష్ణు, మోహన్ బాబు హస్తాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక గొడవలు జరుగుతున్నప్పటికీ నుంచి విష్ణు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం మనోజ్‌కను ఉద్దేశించిన పోస్టులు మాత్రం ఇండైరెక్ట్‌గా పెట్టాడు. మంచు మనోజ్ కూడా ఏం ఊరుకోలేదు అన్నకి తగ్గట్లు కౌంటర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు.. ‘‘నా ఎదుట శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబునే నాకు తండ్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. మా కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్‌లో భాగంగా పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు.



Next Story