కూలీ మూవీ పై స్పందించిన వివాదాస్పద డైరెక్టర్.. ఇది సినిమా కాదంటూ షాకింగ్ ట్వీట్

by I. Sairam |

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie).

కూలీ మూవీ పై స్పందించిన వివాదాస్పద డైరెక్టర్.. ఇది సినిమా కాదంటూ షాకింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో ‘కూలీ సినిమా కాదు..ఇది ఒక ఉద్యమం’ అనే రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Link

Next Story