నూతన వధూవరులకు అభినందనలు.. ప్రియమైన జైనాబ్‌‌కు స్వాగతం.. చైతన్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-07 03:50:05  IST  )

నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil) శుక్రవారం ఉదయం త‌న ప్రియురాలు జైనబ్‌ రవడ్జీ(Jainab Ravadzee)ని వివాహం చేసుకున్నాడు.

నూతన వధూవరులకు అభినందనలు.. ప్రియమైన జైనాబ్‌‌కు స్వాగతం.. చైతన్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil) శుక్రవారం ఉదయం త‌న ప్రియురాలు జైనబ్‌ రవడ్జీ(Jainab Ravdzee)ని వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున(Nagarjuna) ఇంట్లో తెల్ల‌వారుజామున 3 గంటలకు వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్ళికి పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో చైతన్య పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా హీరో నాగ చైతన్య(Naga Chaitanya) పెళ్లి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నూతన వధూవరులకు అభినందనలు.. ప్రియమైన జైనాబ్‌కు కుటుంబానికి స్వాగతం’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫొటోలో అక్కినేని నాగార్జున – అమల, అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ, కొత్త జంట అక్కినేని అఖిల్ – జైనబ్‌ రవడ్జీ ఇలా ముగ్గురు అక్కినేని దంపతులు ఉన్నారు. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి దిగిన ఫొటో కావడంతో అక్కినేని అభిమానులు క్యూట్ ఫొటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story