- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న నానికి కంగ్రాట్స్.. అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్
నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం ‘హిట్ 3’(Hit-3).

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం ‘హిట్ 3’(Hit-3). అయితే దీనిని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Thipirneni) నిర్మించారు. శైలేష్ కొలను ప్లాన్ చేసిన క్రేజీ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మూడో సినిమాగా వచ్చిన ఈ చిత్రం మే 1న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
అదే విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అయితే నాని ఇంతటి విజయాన్ని సాధించడంతో అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) తన ఎక్స్(X) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. అందులో ‘హిట్-3తో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ మరియు సూపర్ సక్సెస్ అందుకున్న ప్రియమైన నాని అండ్ మూవీ టీమ్‌కు అభినందనలు.. శైలేష్ కొలను, తిపిర్నేని ప్రశాంతి, వాల్ పోస్టర్ సినిమా ప్రతి మూవీతో ఫ్రాంచైజీని మరింత బలంగా పెంచుకుంటూనే ఉంది. మీ అందరి ప్రయత్నాలకు చీర్స్’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.






