- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్జున్ దాస్ కొత్త సినిమా టైటిల్ లాంచ్ చేసిన లోకేష్ కనగరాజ్
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో కనిపించగా, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్ హీరోయిన్.

దిశ, సినిమా : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో కనిపించగా, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్, కామెడీ కింగ్ యోగి బాబు, వెటరన్ నటి వడివుకరసి తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ అకిలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ హౌస్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది, హరీష్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ లాంచ్ చేసిన టైటిల్ & ఫస్ట్-లుక్ పోస్టర్ మధ్యతరగతి కుటుంబం మనసుని తాకేలా ప్రజెంట్ చేస్తోంది. అర్జున్ దాస్ ఆఫీస్ బ్యాక్‌ప్యాక్‌తో అన్నా బెన్ హ్యాండ్‌బ్యాగ్‌తో యోగి బాబు, వడివుక్కరసి ట్రావెల్ బ్యాగ్స్‌తో చిన్నారి అకిలన్ విజయాన్ని సూచించే ట్రోఫీని తీసుకెళ్లడం క్యురియాసిటీ పెంచింది. తాజా టైటిల్, పోస్టర్ అద్భుతమైన స్పందనను పొందాయి. ఈ సినిమా మంగళూరు, చెన్నై , ముంబైలలో షూటింగ్ 80% పూర్తి కాగా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలవుతోంది.






