'కుబేర' సినిమా...సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు !

by velandi.Saikiran |

తమిళ్ స్టార్ ధనుష్ (Dhanush), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రష్మిక మందాన (Rashmika Mandanna) ముగ్గురి

కుబేర సినిమా...సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు !
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ ధనుష్ (Dhanush), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రష్మిక మందాన (Rashmika Mandanna) ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర (kuberaa). గత నెలలో రిలీజ్ అయిన ఈ కుబేర సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... దాదాపు 150 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే అలాంటి కుబేర సినిమాకు కొత్త చిక్కులు వచ్చాయి.

కుబేర సినిమాను ఆన్లైన్ పైరసీని అరికట్టాలని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Film Chamber of Commerce). సెంట్రల్ మాల్ లోని పివిఆర్ ( PVR) థియేటర్ స్క్రీన్ 5 లో చట్ట విరుద్ధంగా సినిమాను రికార్డ్ చేసినట్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇటీవల పైరసీ చేసిన కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కుబేర సినిమా... అవినీతి డబ్బును ఎలా వైట్ మనీ గా మార్చుతారు..? దానికోసం బిచ్చగాళ్లను ఎలా వాడుకుంటారు ? ఇందులో నాగార్జున ఎలాంటి సహాయం చేస్తారు అనేది స్టోరీ. క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రావడంతో సక్సెస్ అందుతుంది.

Next Story