- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anil Ravipudi: ఆ సినిమా ఇంటర్వెల్ మొత్తం మార్చేశా.. నా నిర్ణయాలు అలాగే ఉంటాయి
అనిల్ రావిపూడి మాట్లాడుతూ... సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి ఇంటర్వెల్ ఐశ్వర్య రాజేష్, పాపా పాండేని చంపే దగ్గర రావాలనుకున్నాం. కానీ ఆ తర్వాత అది వద్దనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: ఒక సినిమా హిట్ కావాలి అంటే కథ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో స్క్రీన్ ప్లే కూడా అదే స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకు ప్రధాన కారణం కొత్త కథ రాయడం చాలా కష్టం, కానీ పాత కథను కొత్త తరహాలో చూపించినట్లయితే సినిమా మంచి విజయం సాధిస్తుంది. అందుకే దర్శకులు కథ రాయడం పట్ల ఏ స్థాయిలో శ్రద్ధ పెడతారో స్క్రీన్ ప్లే విషయంలో కూడా అదే స్థాయిలో కసరత్తులు చేస్తారు.
ఒక సినిమా స్టార్ట్ కావడానికి ముందు స్టోరీ మొత్తం తయారయ్యాక స్టార్టింగ్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం రెడీ చేసుకుంటారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా దర్శక, నిర్మాతలకు ఆర్డర్ మార్చాల్సి వస్తే మార్చుకొని ముందుకు వెళుతుంటారు, కానీ అది కాస్త రిస్క్. అలా రిస్క్ చేసి అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్టోరీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అలాగే షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేవరకు కూడా ఇంటర్వెల్ ఐశ్వర్య రాజేష్, పాపా పాండేని బ్రిడ్జ్ మీద నుండి తోసే సన్నివేశంతో రావాలి. కానీ నాకు అప్పటివరకు ఇంటర్వెల్ రాకుంటే బాగోదు, ముందే ఓ బెటర్ సన్నివేశంతో ఇంటర్వెల్ వస్తే బాగుంటుంది" అని దానిని సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ చేసి వేరే సన్నివేశంతో ఇంటర్వెల్ వేసినట్లు చెప్పుకొచ్చాడు. 2025 సంక్రాంతికి విడుదల అయిన ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.






