భారీ ఫీస్ట్‌తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు.. ఉస్తాద్ భగత్ నుంచి క్రేజీ పోస్టర్ షేర్

by Gugulothu.Kavitha |

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ (UstaadBhagatSingh).

భారీ ఫీస్ట్‌తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు.. ఉస్తాద్ భగత్ నుంచి క్రేజీ పోస్టర్ షేర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్ (UstaadBhagatSingh). హరీష్‌ శంకర్‌ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ దేఖ్‌ లేంగే సాలా సాంగ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.

తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్ నుంచి మరో బ్లాస్టింగ్‌ స్టిల్ షేర్ చేశారు మేకర్స్‌. ‘ఇది మొదలవుతుంది.. ఆనందంతో మీ చేతులను పైకెత్తి మా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం చీర్స్ చెప్పండి.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, కల్ట్‌ కెప్టెన్‌ హరీష్‌ శంకర్‌ కలిసి భారీ ఫీస్ట్‌తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు..’ అంటూ హరీష్ శంకర్, పవన్‌ కల్యాణ్‌ టీం హ్యాండ్‌ రైజ్‌ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎలాంటి బ్లాస్ట్‌ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Next Story