రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం

by Malleboina Mahesh |

ప్రముఖ తెలుగు హాస్య నటుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు హాస్య నటుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం (Brahmanandam) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Draupadi Murmu) మర్యాదపూర్వకంగా కలిశారు. శీతాకాల విడిది లో భాగంగా హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని ఆయన స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. బ్రహ్మానందం లోని గొప్ప నటుడిని మనం చూశాం, కానీ ఆయనలోని అద్భుతమైన చిత్రకారుడిని (Artist) మరోసారి ఈ సమావేశం గుర్తుచేసింది. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పెన్సిల్‌తో గీసిన శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుమతిగా అందజేశారు.

బ్రహ్మానందం గీసిన ఈ చిత్రంలోని సూక్ష్మ నైపుణ్యాన్ని చూసి రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. రాష్ట్రపతికి బహుమతి అందజేస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రహ్మానందం కేవలం నవ్వులనే కాదు, అద్భుతమైన కళాఖండాలను కూడా సృష్టించగలరని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక గొప్ప కళాకారుడు దేశ అత్యున్నత వ్యక్తిని కలవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story