‘జన నాయగన్‌’ రిలీజ్ విషయంలో సీఎం విజయ్ షాకింగ్ నిర్ణయం!

by velandi.Saikiran |

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయగన్... అతి త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.

‘జన నాయగన్‌’ రిలీజ్ విషయంలో సీఎం విజయ్ షాకింగ్ నిర్ణయం!
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో టీవీకే విజయ్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలలోనే అధికారంలోకి వచ్చి, చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని, తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయగన్... అతి త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన పేరు ముందు దళపతికి బదులు ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ పెట్టనున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

అయితే ఈ అంశాన్ని సున్నితంగా సీఎం విజయ్ తిరస్కరించినట్లు టాప్ నడుస్తోంది. ఎప్ప‌టి లాగానే ద‌ళ‌ప‌తి ట్యాగ్ లైన్ వేయాల‌ని నిర్మాత‌లకు స‌మాచారం అందించార‌ట‌. అటు ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల‌ను మార్చాల‌ని ముందుగా భావించినా, వెన‌క్కి త‌గ్గార‌ని టాక్‌. దీంతో ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది. కాగా జ‌న నాయ‌గ‌న్ సినిమా జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సింది, కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఈ సినిమాను జూన్ మాసంలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నార‌ట‌.

Next Story