గద్దర్ అవార్డులు అందుకోబోతున్న టాలీవుడ్‌ యాక్టర్స్‌కు CM రేవంత్ విషెస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-13 15:21:44  IST  )

సినిమా(Tollywood) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు'(Gaddar Awards) అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు.

గద్దర్ అవార్డులు అందుకోబోతున్న టాలీవుడ్‌ యాక్టర్స్‌కు CM రేవంత్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా(Tollywood) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు'(Gaddar Awards) అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు - తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమని అన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. శనివారం (జూన్ 14 వ తేదీ) హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.

Next Story