అఖండ 2 ప్రీ రిలీజ్...బ‌న్నీ దూరం, స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రంటే !

by velandi.Saikiran |

అఖండ 2 ప్రీ రిలీజ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్ గా

అఖండ 2 ప్రీ రిలీజ్...బ‌న్నీ దూరం, స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య ఇటీవల చేసిన మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న అఖండ 2 సినిమాకు తమన్ మ్యూజిక్ వాయించాడు. డిసెంబర్ 5వ‌ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

అతి త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఈ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందు అల్లు అర్జున్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారని ప్రచారం సాగింది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా అల్లు అర్జున్ రావడంలేదని తెలుస్తోంది. కానీ సక్సెస్ మీట్ కు మాత్రం బన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రీమియర్ షోలు సైతం నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి ప్రీమియర్లు ప్రదర్శించాలని అఖండ 2 టీం ఫిక్స్ అయినట్లు టాక్. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీనిపై ప్రకటన రానుంద‌ట‌.

Next Story