- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట్లాది మంది అభిమానులు మీ సొంతం.. బాలకృష్ణకు CM చంద్రబాబు స్పెషల్ విషెస్
హిందుపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హిందుపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, బాలయ్య బర్త్ డే సందర్భంగా ‘అఖండ 2’ టీజర్ (Akhanda 2 Teaser)ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, తమన్ సంగీతం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్ ఇది వస్తోంది. దసరా కానుకగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది.






