- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Raja Saab: ప్రభాస్ కు కొత్త టెన్షన్..ఆ హీరో సినిమాకే అక్కడ క్రేజ్ ?
ఒకే రోజున ఈ రెండు సినిమాలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ కు కొత్త టెన్షన్ మొదలైందట.

దిశ, వెబ్ డెస్క్: 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సారి సరికొత్తగా ఉండనుంది. బడా హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అలాగే తమిళ హీరో విజయ్ సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, విజయ్ నటించిన జన నాయగన్ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ఇందులో విజయ్ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా రానుంది. అటు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ హారర్ కామెడీ జోనర్ లో వస్తోంది.
ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఒకే రోజున ఈ రెండు సినిమాలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ కు కొత్త టెన్షన్ మొదలైందట. ది రాజా సాబ్ కంటే విజయ్ జన నాయగన్ సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమా తక్కువ సమయంలోనే సాలిడ్ బుకింగ్స్ తో దూసుకుపోతోందట. ఇదే ట్రెండు కొనసాగితే, రాజా సబ్ కు జన నాయగన్ సినిమా గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారట.






