KJ Yesudas : యేసుదాస్ ఆరోగ్యంపై క్లారిటీ

by Muthe.Rajitha |

ఇండియన్ లెజెండరీ సింగర్ కేజే యేసుదాస్(Singer KJ Yesudas) ఆరోగ్యంపై ఆయన కుమారుడు విజయ్(Singer Vijay) క్లారిటీ ఇచ్చారు.

KJ Yesudas : యేసుదాస్ ఆరోగ్యంపై క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ లెజెండరీ సింగర్ కేజే యేసుదాస్(Singer KJ Yesudas) ఆరోగ్యంపై ఆయన కుమారుడు విజయ్(Singer Vijay) క్లారిటీ ఇచ్చారు. యేసుదాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆయన అమెరికాలో ఉన్నారని, ఆయనకేమి కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నట్టు విజయ్ మీడియాకు వెల్లడించారు. దయచేసి అబద్దపు వార్తలు ప్రసారం చేయకండి అంటూ ఆయన ఆవేదన చెందారు. తప్పుడు వార్తల వలన ఆయన అభిమానులు చెందుతారని, ఇకనైనా అలాంటి పుకార్లు సృష్టించవద్దని కోరారు. యేసుదాస్ అన్ని భాషల్లో కలిపి 50 వేలకు పైగా పాటలు పాడారు. 8 జాతీయ అవార్డులను అందుకున్నారు. అంతేకాదు దేశ అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు. యేసుదాస్ ఆరోగ్యంగానే ఉన్నారన్న వార్త విని కోట్లాది ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story