Mass Jatara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

by Chukka Sudharani |   (  Updated:2025-04-01 15:31:10  IST  )

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మాస్ జాతర’ (Mass Jatara) ఒకటి.

Mass Jatara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మాస్ జాతర’ (Mass Jatara) ఒకటి. డైరెక్టర్ భాను భోగవరపు (Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల చేత మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని రిలీజ్ వాయిదా పడే చాన్స్ ఉందంటూ ఫిలిమ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

ఇందులో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ (Nagavanshi) దీనిపై క్లారిటీ ఇచ్చారు. రవితేజ ‘మాస్ జాతర’ సినిమాను జూలై(July)లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అని తెలిపారు. దీంతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చినట్లు అయింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల రవితేజ నటించిన చిత్రాలు పరాజయాలు చెందటంతో.. మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆశలు మొత్తం ‘మాస్ జాతర’పైనే పెట్టుకున్నారు. మరి ఈ జూలైకి అయినా రవితేజ వస్తాడో రాడో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రావాల్సి ఉంది.

Next Story