- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త.. హరిహర వీరమల్లు విడుదలపై క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie) విడుదలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie) విడుదలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతం అయ్యాయి. ఈనెల 12నే విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈసారి పక్కాగా జూన్ 26వ తేదీన విడుదల చేస్తామని నిర్మాత గట్టిగా ఫిక్స్ అయ్యారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా.. బాబి డియోల్, సునీల్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు అభిమానుల్లో హైప్ పెంచాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నుంచి స్ట్రెయిట్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.






