డైరెక్టర్‌గా మారానున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. అలాంటి జోనర్ సినిమాతో ఎంట్రీ

by Pulgam srinivas |

తన తొలి సినిమా కోసం ఎమోషనల్ డెప్త్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ కథను రత్న వేలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్‌గా మారానున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. అలాంటి జోనర్ సినిమాతో ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు సంపాదించుకున్న రత్నవేలు మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకత్వం వహించేందుకు ఓ కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు, మరికొన్ని రోజుల్లో అది పూర్తికానున్నట్లు సమాచారం. తన తొలి సినిమాకోసం ఎమోషనల్ డెప్త్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ పూర్తయిన తర్వాత, ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారో ఆ హీరోను కలిసి కథను వినిపించాలనే ఆలోచనలో ఈ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఉన్నట్లు సమాచారం.

దీంతో రత్నవేలు దర్శకుడిగా మారితే తొలి సినిమాను ఎవరితో చేస్తారనే ఆసక్తి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా నెలకొంది. తాజాగా ఈయన రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. సినిమా విడుదల నేపథ్యంలో రత్నవేలు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఆయన, పెద్ది సినిమా అద్భుతంగా ఉండబోతోందని, రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పెద్ది సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాల్లో రత్నవేలు కెమెరా పనితనానికి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

Next Story