- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవంబర్ 1, 2 తేదీల్లో “ సినిమాటికా ఎక్స్పో 2025”
హైదరాబాద్ హైటెక్ సిటీలోని నొవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో “ సినిమాటికా ఎక్స్పో 2025” నిర్వహించబోతున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.జి. విందా తెలపారు. ఈవెంట్ ద్వారా ప్రపంచ సినిమా దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ హైటెక్ సిటీలోని నొవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో “ సినిమాటికా ఎక్స్పో 2025” నిర్వహించబోతున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.జి. విందా తెలపారు. ఈవెంట్ ద్వారా ప్రపంచ సినిమా దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను తాను, మరియు 'సినిక క్రియేటర్స్ కౌన్సిల్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, AI ఫిల్మ్‌మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు మరియు నెట్‌వర్కింగ్ సెషన్లు జరగనున్నాయని తెలపారు. ఈ సంవత్సరం థీమ్ “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema.” అని ఇది కేవలం నినాదం కాదన్నారు. భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టే దృక్పథం అని స్పష్టం చేశారు. 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు “హాలీవుడ్ టు హైదరాబాద్” కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ఈ ఎడిషన్ నిలుస్తుందన్నారు.






