- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల కోసమే అంత్యక్రియలకు హాజరైన స్టార్ నటుడు.. స్వయంగా తానే.. షాకింగ్ వీడియో వైరల్
బ్యూటిఫుల్ అనన్యా పాండే తండ్రి చంకీ పాండే ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న నటుడే. కానీ తర్వాత ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. లైగర్‌లో ఆమెకు తండ్రిగా నటించిన ఆయన..

దిశ, ఫీచర్స్ : బ్యూటిఫుల్ అనన్యా పాండే తండ్రి చంకీ పాండే ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న నటుడే. కానీ తర్వాత ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. లైగర్‌లో ఆమెకు తండ్రిగా నటించిన ఆయన.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్‌లోనూ ప్రత్యక్షమవుతాడు. ఈ మధ్య ఓ అవార్డు ఫంక్షన్‌లో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ ఇరగదీసి వైరల్ అయ్యారు కూడా. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు చంకీ. తను సినిమాల్లో బిజీగా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నాడు.
‘ఆ కాలంలో సోషల్ మీడియా, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి ఏమీ లేవు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డబ్బు సంపాదించలేం. యాడ్స్ కూడా ఎక్కువగా ఉండేవి కావు. సినిమాలు, ఈవెంట్స్ చేయడం వల్లనే డబ్బులు వచ్చేవి. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ ఆర్గనైజర్ కాల్ చేసి ఇక్కడ ఈవెంట్ ఉంది వెంటనే రండి అని కాల్ చేశాడు. నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నా అంటే మీరు వెళ్లే దారిలోనే వచ్చి వెళ్లండి అన్నాడు. వైట్ డ్రెస్ వేసుకుని రండి అని చెప్పాడు. అది ఈవెంట్ థీమ్ అనుకుని ఓకే అన్నా. వెళ్లేసరికి అందరూ సాడ్‌గా ఉన్నారు. ఎదురుగా డెడ్ బాడీ ఉంది. దీంతో నన్ను పిలిచిన ఆర్గనైజర్ చనిపోయాడుకున్నా. కానీ నేను వెళ్లింది అంత్యక్రియలకు అని తర్వాత అర్థమైంది. నాకు ఫోన్ చేసిన ఆర్గనైజర్ నా దగ్గరకు వచ్చి ఎక్కువ ఏడిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పడంతో షాక్ అయ్యా’ అని స్వయంగా తానే చెప్పుకొచ్చాడు.






