అక్షయ్ కుమార్ పై కోడిగుడ్ల దాడి.. ఎందుకంటే?

by Muthe.Rajitha |

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మీద మహిళలు కోడిగుడ్లు విసిరారు. అయినప్పటికీ అక్షయ్ ఒక్కమాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు.

అక్షయ్ కుమార్ పై కోడిగుడ్ల దాడి.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మీద మహిళలు కోడిగుడ్లు విసిరారు. అయినప్పటికీ అక్షయ్ ఒక్కమాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. అసలు ఏం జరిగింది అంటే.. 1992లో విడుదలైన ‘ఖిలాడి’ చిత్రంలో ఓ పాట కోసం అక్షయ్‌పై అమ్మాయిలు 100 కోడిగుడ్లు విసిరి కొట్టించుకున్నారని, చిత్రీకరణ అనంతరం దుర్వాసన వచ్చినా కోపగించుకోకుండా చాలా కష్టపడ్డారని ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ తెలిపారు.

ప్రేక్షకులను అలరించడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే అంకితభావం కలిగిన నటుడని, ఎప్పుడూ స్టెప్స్ మార్చమని అడగని, ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారని అన్నారు. అభిమానులను అలరించడం కోసం ఏదైనా చేయగలరని, ఇప్పటివరకూ అతడిలా కష్టపడే నటులను చూడలేదని అక్షయ్‌పై చిన్ని ప్రకాష్ ప్రశంసలు కురిపించారు.

Next Story