- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చియాన్ 63 షూటింగ్ అప్డేట్.. ఈ చిత్రంతో తమిళ ఎంట్రీ ఇస్తున్న యంగ్ బ్యూటీ
ఈ ఏడాది ‘వీర ధీర శూరన్-2’తో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. ఇప్పుడు తన 63వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: ఈ ఏడాది ‘వీర ధీర శూరన్-2’తో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. ఇప్పుడు తన 63వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని చెన్నై, దాని పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం చియాన్ విక్రమ్ సుమారు 50 నుండి 60 రోజుల కాల్ షీట్‌ను కేటాయించారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ద్వారా యంగ్ బ్యూటీ రియాషిబు నటిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఆమె ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తుండగా.. హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వీరే కాకుండా.. ఊర్వశి, ఎంఎస్ భాస్కర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన, విభిన్నమైన చిత్రంగా రూపొందించాలని చిత్ర బృందం యోచిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.






