Chiyaan Vikram: ‘96’ డైరెక్టర్‌తో కోలీవుడ్ స్టార్ హీరో సినిమా.. ఈసారి లవ్ కాదు యాక్షన్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Chiyaan Vikram: ‘96’ డైరెక్టర్‌తో కోలీవుడ్ స్టార్ హీరో సినిమా.. ఈసారి లవ్ కాదు యాక్షన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది ‘వీర ధీర శూరన్-2’తో ఆకట్టుకున్న ఆయన ప్రజెంట్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ మేరకు విక్రమ్ తన 64వ మూవీ కోసం దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

‘తెరపై మ్యాజిక్‌కు చూపించేందుకు మేము కొలబ్రేట్ అయ్యాము.. VelsFilmIntlలో మేము మా నెక్ట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘చియాన్64’ని అనౌన్స్ చేయడం చాలా గర్వంగా ఉంది. దీనికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు’ మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం అంటూ పలు ఫొటోలను ఫేర్ చేసింది వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. 96 సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చియాన్ విక్రమ్ సినిమా కన్ఫర్మ్ కావడంతో.. కోలీవుడ్ ప్రేక్షకులు సంతోషిస్తున్నారు. కాగా.. చియాన్ విక్రమ్, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. లింక్


Next Story