Chiyaan Vikram: వీర ధీర సూర‌న్ పార్ట్ -2 టీజ‌ర్‌ విడుదల

by Kodari Anjali |   (  Updated:2025-08-03 10:37:24  IST  )

వైవిధ్యమైన స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డారు తమిళ ప్రముఖ హీరో చియాన్ విక్రమ్(Chian Vikram).

Chiyaan Vikram: వీర ధీర సూర‌న్ పార్ట్ -2 టీజ‌ర్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: వైవిధ్యమైన స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డారు తమిళ ప్రముఖ హీరో చియాన్ విక్రమ్(Chian Vikram). రీసెంట్‌గా ఈ నటుడు నటించిన తంగలాన్(Tangalan) సినిమా థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం విక్రమ్ వీర ధీర సూర‌న్(Veera Dheera Sooran) పార్ట్ 2 లో నటిస్తున్నారు. అరుణ్ కుమార్(Arun Kumar) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా హెచ్ఆర్‌. పిక్చ‌ర్స్ ప‌తాకం(HR. Pictures banner)పై రియాశిబు(Riashibu) నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌(Action entertainer)గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దుషారా విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటిస్తోంది. సురాజ్ సిద్ధిక్(Suraj Siddique), వెంజరమూడు(Venjaramudu), ఎస్‌జే. సూర్య(SJ.surya) తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జీవీ. ప్రకాశ్ కుమార్(G.V. Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక నిమిషం 47 సెకన్స్ నిడివి ఉన్న వీర ధీర సూర‌న్ పార్ట్ 2 టీజ‌ర్‌ చూసినట్లైతే.. హీరో కిరాణా షాప్ నడుపుతూ ఫ్యామిలీనీ పోషిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Video Link..

Sonu Sood: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న సోనూ సూద్ ‘ఫతే’ టీజర్

Next Story