- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiyaan 63: అదిరిపోయిన ఫస్ట్ ఫ్లేమ్
'చియాన్ 63' టీజర్ విడుదల.. డార్క్ లుక్‌తో ఆకట్టుకున్న విక్రమ్.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇప్పటివరకు అధికారికంగా టైటిల్ ఖరారు చేయలేదు. అందుకే ప్రస్తుతం ఈ సినిమాను ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈరోజు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ ఫ్లేమ్’ పేరుతో ఒక టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టీజర్ మొత్తం డార్క్ మరియు సస్పెన్స్ వాతావరణంలో సాగుతూ, రహస్యమైన గతం ఉన్న వ్యక్తిగా విక్రమ్ పాత్రను చూపించారు. ప్రత్యేకంగా టీజర్‌లో ఓ వంటగదిలో ఉన్న విక్రమ్‌పై కొంతమంది బాంబులు విసిరినా, ఆయన మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ కనిపించడం విశేషంగా నిలిచింది. ఈ సన్నివేశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇది ఓ పవర్‌ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక సంతోష్ నారాయణన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.






