- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఆ స్టార్ హీరోతో పోటీ పడనున్న చిరు
చిరు 'విశ్వంభర', రజనీ 'జైలర్ 2' దసరా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. చివరిసారిగా వీరిద్దరూ 2023లో పోటీ పడ్డారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్' చిత్రం 2023 ఆగస్టు 10న విడుదల కాగా, చిరంజీవి హీరోగా రూపొందిన 'భోళా శంకర్' ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బాక్సాఫీస్ పోరులో 'భోళా శంకర్' ఘోర పరాజయాన్ని చవిచూడగా, 'జైలర్' మాత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరోసారి ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'జైలర్ 2'ను కూడా ఇదే సీజన్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతసారి ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో 'భోళా శంకర్' భారీ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనని కొందరు మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.






