- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చ్ నెలలో మొదలుకానున్న చిరు-బాబీ చిత్రం
ఈ మార్చ్ నుండి మొదలుకానున్న చిరు-బాబి కాంబో మూవీ

దిశ, వెబ్ డెస్క్: వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చిరంజీవి-బాబి కలయికలో మరో చిత్రం రాబోతుంది. ఈ మూవీ చిరు 158వ చిత్రంగా రానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడి చాలా రోజులైంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి ఇందులో హీరోయిన్‌గా కనిపించే అవకాశాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె నారాయణ్, నిషా వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు. వాల్టేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. దాంతో ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లేకు కోన వెంకట్ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయన బాబి-చిరుతో మామూలు సినిమా చేయట్లేదని, తన సినీ ప్రస్థానంలో టచ్ చేయని సబ్జెక్టును చేయనున్నారని చెప్పారు. స్వతహాగా బాబీ, చిరుకి వీరాభిమాని. ఇప్పటికే ఆయనకు ఒక హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు మరోసారి సినిమా చేయబోతున్నాడు అనడంతోనే దానిపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంతో ఈ కాంబో మరో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.






