- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi: మ్యాడ్ నెస్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో చిత్రం ఉంది. ఇక వీటి నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఆగస్టు 22 న చిరంజీవి బర్త్‌డే ఉండగా.. ఆ సందర్భంగా విశ్వంభర రిలీజ్‌పై క్లారిటీతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా నుంచి ఏదోక అప్డేట్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక వాటి నుంచి అప్డేట్స్ వస్తాయో రావో అని విషయాన్ని పక్కన పెడితే.. చిరు బర్త్‌డే స్పెషల్‌గా ఆ రోజు ‘స్టాలిన్’ సినిమా రీరిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్టాలిన్’ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఆగస్టు 22కి రీరిలీజ్ కాబోతుండగా.. తాజాగా స్టాలిన్ 4కె ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇచ్చారు మేకర్స్.






