వినాయకచవితి స్పెషల్.. కేరళ నుంచి వచ్చిన "మన శంకర వరప్రసాద్ గారు"

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-28 05:00:39  IST  )

వినాయకచవితి (Vinayaka Chaturthi) సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

వినాయకచవితి స్పెషల్.. కేరళ నుంచి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు
X

దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). ఈ సినిమా 2026 సంక్రాంతి (Sankranthi 2026)కి విడుదల కానుండగా.. ఇటీవలే మూవీ మేకర్స్ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా అనిల్ రావిపూడి సినిమా కావడంతో చిరంజీవి కామెడీ టైమింగ్ ను ఏ స్థాయిలో చూపిస్తారోనని ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. టైటిల్ టీజర్ ను బట్టి సినిమాలో ఫ్యామిలీ మార్క్ ఉంటుందని స్పష్టమవుతోంది.

కాగా.. వినాయకచవితి (Vinayaka Chaturthi) సందర్భంగా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్తూ.. చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో చిరంజీవి పద్ధతిగా పట్టు వస్త్రాల్లో ఒక పడవపై నిల్చుని వస్తున్న స్టిల్ ఉంది. ఇటీవలే కేరళలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ తీసిన ఫొటోతో పండుగ సందర్భంగా చిత్రబృందం స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ అన్నయ్య సూపర్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story