దీపావ‌ళి వేడుక‌లు...చిరంజీవి ఇంటికి మీసాల పిల్ల‌

by velandi.Saikiran |

హీరోయిన్ నయనతార, నాగార్జునతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

దీపావ‌ళి వేడుక‌లు...చిరంజీవి ఇంటికి మీసాల పిల్ల‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి పెద్ద అన్నలాగా ఆయన కొనసాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగాస్టార్ చిరంజీవి అండగా నిలుస్తారు. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి పిలుపు మేరకు చాలా మంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇందులో హీరోయిన్ నయనతార, నాగార్జునతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాగార్జున, వెంకటేష్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఇలాంటి క్షణాలు నా గుండెకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.

ప్రేమ, నవ్వు రెండూ కలిసి ఉండటం వల్ల జీవితం ఎంతో వెలుగు వెలుగుతుంది. ఈ దీపావళికి కొత్త అనుభూతి వచ్చింది అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆ తారలతో దిగిన ఫోటోలను పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార చేస్తుండగా స్పెషల్ లో వెంకీ మామ మెరువనున్నారు.








Next Story