చిరంజీవి పక్కన వెంకీ మామ.. హైప్ పెంచేసిన గ్లిమ్ప్స్

by Chukka Sudharani |

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు చాలా తక్కువే. ఇటీవల చిన్న హీరోల మూవీస్ అక్కడక్కడ కనిపించినా అగ్ర హీరోలవి మాత్రం లేవనే చెప్పాలి.

చిరంజీవి పక్కన వెంకీ మామ.. హైప్ పెంచేసిన గ్లిమ్ప్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు చాలా తక్కువే. ఇటీవల చిన్న హీరోల మూవీస్ అక్కడక్కడ కనిపించినా అగ్ర హీరోలవి మాత్రం లేవనే చెప్పాలి. తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు నిర్మించాలని గతంలో దర్శక, నిర్మాతలు ప్రయత్నించినా ఫ్యాన్స్‌కు భయపడి పట్టలెక్కలేదు. కానీ ఫ్యామిలీ డైరెక్టర్ అనీల్ రావిపూడి పెద్ద సహాసమే చేస్తున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ మూవీ నుంచి ఫిల్మ్ నగర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు చిరంజీవి పోస్ట్ చేసిన గ్లిమ్ప్స్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

‘మన శంకర వరప్రసాద్’ మూవీలో విక్టరీ వెంకటేష్ భాగమైనట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఈ మేరకు వెంకీ మామకు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లిమ్ప్స్ అటు మెగాస్టార్, ఇటు దగ్గుపాటి ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, వెంకటేష్ ‘మన శంకర వరప్రసాద్’ మూవీలో చిరంజీవికి సమానంగా ఉండే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లింక్


Next Story