Chiranjeevi: మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-04-11 12:56:11  IST  )

తాజాగా సింగపూర్‌(Singapore)లో ఓ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Chiranjeevi: మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: తాజాగా సింగపూర్‌(Singapore)లో ఓ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడ్డాడు. ఆ బాలుడి చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందించాడు. ఇప్పుడు మార్క్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Next Story