- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరి హర వీరమల్లు కోసం రంగంలోకి బడా హీరో !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood) మెగా కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood) మెగా కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత.. ఇండస్ట్రీని షేక్ చేసే హీరోగా మారాడు. ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న హీరోలలో... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.
అయితే అలాంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... హరిహర వీరమల్లు సినిమాతో (Hari Hara Veera Mallu) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జూలై 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం భారీ ప్లాన్స్ వేస్తోంది. క్రిష్ ( kRISH )దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొగల్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ( Chirajeevi) రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం అందుతుంది. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన రాబోతుందని చెబుతున్నారు.






