- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi: రికార్డులు వస్తుంటాయి..పోతుంటాయి, మీరే నాకు శాశ్వతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాగా... బంపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంపై ఎమోషనల్ పోస్టు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. రికార్డులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి... కానీ మీరు తనపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్ళు చూపించిన ఆదరణతో తన మనస్సు కృతజ్ఞత భావంతో పూర్తిగా నిండిపోయిందని ఎమోషనల్ అయ్యారు. మీరు లేనిదే తాను లేను... ఈ విజయం కేవలం తెలుగు అభిమానులది మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు. స్క్రీన్ పైన తనను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లు తనను నడిపించే శక్తి అన్నారు. మీ ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుందని.. ఈ సినిమా చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
300 కోట్ల క్లబ్ లో చిరంజీవి సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ దాటినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా... కన్నడ వ్యక్తిగా విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు సందడి చేశారు. కామెడీ, ఫ్యామిలీ జోనర్ లో ఈ సినిమా వచ్చింది.
Read More... ఆపేదే లేదు.. మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ






