కన్నీరు పెట్టిన చిరంజీవి.. కోటా శ్రీనివాస రావు పార్థివదేహానికి నివాళి

by Gantepaka Srikanth |

విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు(Kota Srinivas Rao) భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నివాళులర్పించారు.

కన్నీరు పెట్టిన చిరంజీవి.. కోటా శ్రీనివాస రావు పార్థివదేహానికి నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు(Kota Srinivas Rao) భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా ఇద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో ప్రారంభమైంది.. తెరమీద కోటా శ్రీనివాస్ నటన అద్భుతం.. ఆయన హాస్య చమత్కారం కూడా అద్భుతం.. ఆయనతో ఎంతో అనుబంధం పెనవేసుకొని ఉంది.. కోట శ్రీనివాసరావు అన్ని యాసలు, మాండలికాలు అవలీలగా మాట్లాడగలరు.. కోట మృతి పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటు’ అని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు నటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ నివాళులు అర్పించారు. కోట పార్థివదేహాన్ని చూసి బ్రహ్మానందం కన్నీటిపర్యంతం అయ్యారు.

టాలీవుడ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా అందరితోనూ నటించారు. ‘అహనా పెళ్ళంట’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

Next Story