“ఆ సినిమా విషయంలో చిరంజీవి తప్పు చేశాడు.. వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

వెంకటేష్ మాట్లాడుతూ, చిరంజీవి చేసిన డాడీ సినిమా తనపై తీసి ఉంటే అద్భుతమైన విజయం సాధించేదని అన్నాడు.

“ఆ సినిమా విషయంలో చిరంజీవి తప్పు చేశాడు.. వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇద్దరూ సమవుజ్జీలు అయినప్పటికీ ఎంతో స్నేహపూర్వకంగా ఉండటం విశేషం. అనేక సందర్భాల్లో వీరి మధ్య ఉన్న స్నేహబంధం అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. వీరిద్దరూ ఎలాంటి ఈగోలు లేకుండా కలిసి నటించడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక గతంలో ఒక సందర్భంలో చిరంజీవి చేసిన డాడీ సినిమా గురించి వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి గారు డాడీ సినిమా చేశారు. అది అద్భుతమైన చిత్రం. కానీ చిరంజీవి గారికి ఉన్న భారీ మాస్ ఇమేజ్ కారణంగా ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. అదే సినిమా నాపై తీసి ఉంటే మరింత పెద్ద విజయాన్ని అందుకునేది అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో సినీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్, వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ కారణంగా డాడీ వంటి భావోద్వేగ ప్రధాన కథ వెంకటేష్‌కు మరింతగా సరిపోయేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story