- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ తండ్రిగా చిరంజీవి...స్పిరిట్ లో మెగాస్టార్ నిడివి ఎంతంటే ?
ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా తృప్తి డిమ్రి ( Tripti Dimri) హీరోయిన్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, జపానీస్, కొరియన్ భాషలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ప్రకటించేశాడు.
ప్రభాస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ?
ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పాత్ర దాదాపు 15 నిమిషాల పాటు ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. అందులో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రానుందట. కాగా ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ సంక్రాంతికి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది.






