- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి చేతిలో మెగా వారసుడు.... అదిరిపోయే ఫోటోలు వైరల్
మెగా వారసున్ని.. ఎత్తుకొని మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) లాలించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో

దిశ, వెబ్ డెస్క్ : మెగా కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం వరుణ్ తేజ్ ( Varun Tej), లావణ్య త్రిపాఠి ఇద్దరూ తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ( LavanyaTripathi ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ ప్రకటించింది. దింతో మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు, తదితరులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
మెగా కుటుంబానికి మెగా వారసుడు వచ్చాడని... సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయం తెలియగానే.. షూటింగ్ వదులుకొని ఆసుపత్రికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అనంతరం మెగా వారసున్ని.. ఎత్తుకొని మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) లాలించారు.
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు నాగబాబు కుటుంబం కూడా... లావణ్య త్రిపాటి, మెగా వారసుడితో ఫోటోలు దిగింది. ముఖ్యంగా లావణ్య త్రిపాటితో ఓ రొమాంటిక్ ఫోటోను కూడా పంచుకున్నాడు వరుణ్ తేజ్. అటు ఈ విషయం తెలియగానే మెగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. క్లిక్
Read More: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు






