- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు నా పెళ్లికి వచ్చారు.. మెగా కోడలు లావణ్య షాకింగ్ కామెంట్స్
మెగా కోడలు, సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు, సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడి గతేడాది పెళ్లి కూడా చేసుకుంది.
ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు నటించిన అందాల రాక్షసి ఈరోజు థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ఇంటర్వూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను యాంకర్.. ఓ వీడియో చూపించాడు.
ఆ వీడియోలో అందాల రాక్షసి మూవీలో.. ‘మిథున మీ పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా’ అని ఓ చిన్నారి అడిగినప్పుడు దానికి ఆమె అవును అన్నట్లు తల ఊపుతోంది కదా ఈ సీన్ ఉన్నవీడియోను చూపిస్తూ ఓ నెటిజన్ నిజంగానే మీ పెళ్లికి చిరంజీవి వచ్చాడు అని కామెంట్ చేశారు అని చెప్పగా.. లావణ్య అవును పర్‌ఫెక్ట్ టైమింగ్ ఆ సీన్ జరిగింది. అది నిజమైంది. 13ఏళ్ల క్రితమే చిరంజీవి నా పెళ్లికి వచ్చారు అని ఫన్నీగా నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.






