- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమాపై బిగ్ అప్డేట్
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయనున్న కొత్త షూటింగ్ ఈ నెల 25వ తేదీన ప్రారంభం కాబోతున్నట్లు టాక్.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. మొన్న సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నారు చిరంజీవి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు సిద్దం అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు చిరు.
వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ ఈ నెల 25వ తేదీన ప్రారంభం కాబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా అనస్వర రాజన్ మెరువనున్నారట. ఆమె తొలి రోజు జరిగే షూటింగ్ లో కూడా పాల్గొంటారని టాక్. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బంపర్ హిట్ అందుకుంది. అదే రేంజ్ లో ఈ మూవీ కూడా ఉండనున్నట్లు టాక్.






