- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. చీఫ్ గెస్ట్‌గా CM రేవంత్
హైదరాబాదు(Hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) అందజేయనున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదు(Hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) అందజేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదనే సంగతి విదితమే. దీంతో 2013 నుండి 2023 వరకు ఉత్తమ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు.
అంతేకాకుండా 2024 నుండి వచ్చిన సినిమాలకు అన్ని కేటగిరీలలో అవార్డులు ప్రధానం చేయబోతున్నారు. కాగా సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ కానున్న ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చీఫ్ గెస్టుగా హాజరయ్యి అతని చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేయబోతున్నారు. అయితే ఈ వేడుకకు ప్రముఖ హీరోలు చిరంజీవి(Chiranjeevi), బాలయ్య(Balakrishna), అక్కినేని నాగార్జున(Nagarjuna) అలాగే విక్టరీ వెంకటేష్(Venkatesh)తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొంతమంది హాజరు కాబోతున్నారు. ఇక తమ అభిమాన హీరోలను ఇలా ఒకే వేదికపై చూడాల్సి వస్తుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






