- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాంగ్‌స్టర్‌గా చిరంజీవి.. నెక్స్ట్ లెవెల్ మాస్ అవతార్
బాబి చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో చిరంజీవి.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లోనే ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఇప్పటికే చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ ఇద్దరి కలయికలో రాబోయే రెండో చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈసారి చిరంజీవిని దర్శకుడు బాబీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారని, అందులో భారీ మాస్ ఎలిమెంట్స్ ఉండనున్నట్లు అలాగే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో చిరంజీవి గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రల్లో కనిపించకపోవడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటి ప్రియమణి హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం బాబీ తన రచయితల బృందంతో కలిసి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.






