Chiranjeevi- Anil Ravipudi: మూవీలో స్టార్ బ్యూటీ.. రఫ్ఫాడించేద్దాం అంటూ హైప్ పెంచేసిన మేకర్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-17 07:12:22  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

Chiranjeevi- Anil Ravipudi: మూవీలో స్టార్ బ్యూటీ.. రఫ్ఫాడించేద్దాం అంటూ హైప్ పెంచేసిన మేకర్స్ (వీడియో)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘మెగా-157’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్యన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati), చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ తన అసలు పేరుతో శంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేసి సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇందులో నయనతార(Nayanthara) రెడీ అవుతూ తెలుగులో మాట్లాడుతుండగా.. మేకప్ ఆర్టిస్ట్ ఏంటి మ్యామ్ తెలుగు సినిమా చేస్తున్నారా అని అడగడంతో అవును అంటుంది. ఆ తర్వాత కారులో పోతూ కారులో మెగాస్టార్ పాట వింటుంది. ఆయనతో నటిస్తున్నట్లు తెలపడంతో తన కారు డ్రైవర్ షాక్ అవుతాడు. ఇక చివర్లో చిరంజీవి మేనరిజంలో ‘‘హలో మాస్టారు.. కెమెరా కొద్ది రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ అందిరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక అనిల్ రావిపూడి వచ్చి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని ఇద్దరు అనడంతో వీడియో ముగుస్తుంది.

ఇక ఈ పోస్ట్‌కు ‘‘జనాలను అప్రయత్నంగా ఆకర్షించే, తరగతులను మంత్రముగ్ధులను చేసే నటి ఎప్పటికీ సొగసైన రాణి, నయనతార Mega157 ప్రయాణంలో చేరింది. ఈ ఎంటర్టైనర్‌లో ఆమె గాంభీర్యం, భావోద్వేగాలను పెద్ద తెరపై ప్రదర్శించేందుకు సిద్ధం అయింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. చాలా రోజుల తర్వాత తెలుగులోకి నయన్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక తన సినిమాలో నయన్ నటిస్తుండటంపై చిరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. కాగా.. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ వచ్చాయి. ముచ్చటగా మూడోసారి చిరు, నయన్ జత కట్టబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు చిరు ‘విశ్వంభర’లో కూడా నటిస్తున్నారు. అలాగే హిట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నారు.

Next Story