హరిహర వీరమల్లు ట్రైలర్.. చిరు, రామ్ చరణ్ రియాక్షన్ ఇదే

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే సమయంలో

హరిహర వీరమల్లు ట్రైలర్.. చిరు, రామ్ చరణ్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే సమయంలో సినిమాలు, అలాగే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే అలాంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరికొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరిహర వీరమల్లు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాతో వస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఈ నెల చివర్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో... ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. జనాలు కూడా ఎగబడి మరి ఈ ట్రైలర్ చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా... పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఈ ట్రైలర్ చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. మరోవైపు ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుందని రామ్ చరణ్ కూడా వెల్లడించారు. సినిమా స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు.. ఈ సినిమా యూనిట్ కు ఆల్ ద బెస్ట్ అంటూ రాంచరణ్ పేర్కొన్నారు.

Next Story