Chinmayi Sripada: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి షాకింగ్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) పలు చిత్రాల్లో సాంగ్స్ పాడి తన గొంతుతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Chinmayi Sripada: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై చిన్మయి షాకింగ్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) పలు చిత్రాల్లో సాంగ్స్ పాడి తన గొంతుతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలాగే తమిళంలో కూడా ఆమె కొన్ని పాటలు పాడింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సినిమాల్లో తన వాయిస్ ఇచ్చి మెస్మరైజ్ చేసింది. కానీ ఆమె మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పడంతో చిన్మయిని బ్యాన్ చేశారు. ఇక అప్పటినుంచి చిన్మయి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా, సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) ముద్దు వివాదంపై చిన్మయి స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

అసలు విషయంలోకి వెళితే.. సింగర్ ఉదిత్ నారాయణ్ లైవ్ షోలో కొంతమంది అమ్మాయిలకు ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారంతా ఓ స్టార్ సింగర్ అయి ఉండి 60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు చేయడమేంటని విమర్శలు చేశారు. అయితే దీనిపై ఉదిత్ నారాయణ స్పందించిన సంగతి తెలిసిందే. అందులో తప్పు లేదని తన అభిమానులు ప్రేమను ఆ రకంగా చూపిస్తారు కాబట్టి అతను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ ఉదిత్ ముద్దు వివాదంకు చెక్ పడటం లేదు.

నిత్యం ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ నెటిజన్ ‘ఉదిత్ నారాయణ్ విషయంలో వీడియో ప్రూఫ్ ఉంది. మరి మిగిలిన బాధితుల విషయంలో ఇలాంటి ఆధారాలు లేవు. అదే తేడా’ అని పోస్ట్ పెట్టగా.. దీనిపై చిన్మయి రియాక్ట్ అయి కౌంటర్ వేసింది. ‘‘అవునవును.. ఈసారి భవిష్యత్తులో అత్యాచారం జరిగినప్పుడు, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నప్పుడు మీ కోసం ఆధారాలు తీసుకొస్తాను’’ అని రిప్లై ఇచ్చింది. ఇక కొందరు ఈ పోస్ట్‌పై విమర్శలు చేస్తుండగా.. కొంతమంది మాత్రం ప్రతి దానికి ఆధారాలు అడిగితే ఎలా సాధ్యం అని చిన్మయికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story